గుంటూరు: ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 163 వ శ్రీ దేవి నవరాత్రులు
Guntur, Guntur | Sep 21, 2025 ఈ నెల 22 వ తేదీ అనగా రేపు సోమవారం నుండి వచ్చే నెల 2 వ తేదీ వరకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 163 వ శ్రీ దేవి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థాన గౌరవ అధ్యక్షులు తెల్లకుల లక్ష్మీ గురుప్రసాద్ తెలిపారు. ఆదివారం నగరంలోని గంటలమ్మ చెట్టు వీధి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఏడాది 9 రోజులపాటు జరిగే నవరాత్రులు ఏడాది 11 రోజులు వచ్చాయని, 11 రోజులపాటు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనం ఇస్తారని చెప్పారు. కావున భక్తులు వేలాదిగా పాల్గొని అమ్మవారి కృపాకు పాత్రులు కావాలని కోరారు.