నాగలాపురం : గ్యాస్ కొనుగోలు సమయంలో లబ్ధిదారులు సంయమనం పాటించాలి : తహశీల్దార్ హనుమాన్ నాయక్
నాగలాపురం మండల పరిషత్ కార్యాలయంలో దీపం-2 ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. తహశీల్దార్ హనుమాన్ నాయక్ మాట్లాడుతూ.. గ్యాస్ ఏజెన్సీ వారి నిర్దేశిత లక్ష్యానికి మించి లబ్ధిదారులు గోదాము వద్దకు వెళితే సంయమనం పాటించాలని కోరారు. ప్రతిరోజు 150 మంది లబ్ధిదారులకు గ్యాస్ పంపిణీ చేసే వీలుందన్నారు. లబ్ధిదారులు ముందుగా డబ్బులు చెల్లించి గ్యాస్ పొందాలని సూచించారు.