అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అఖిల ప్రియ
ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు దేవస్థానం అధికారులు ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం దిగువ అహోబిలంలో వెలసిన శ్రీ ప్రహ్లాద వరద స్వామివారికి అష్టోత్తర పూజలు, శ్రీ అమృతవల్లి అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు.