నంద్యాల అర్బన్: ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు వర్షం
Nandyal Urban, Nandyal | May 27, 2026
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఎమ్మిగనూరు, ఆదోని, నందవరం, బేతంచెర్ల తదితర ప్రాంతాల్లో వర్షంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కారణంగా కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ వర్షం రాబోయే ఖరీఫ్ సాగుకు ఎంతో అనుకూలమని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.