పలమనేరు: ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు, ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కొరకు తరలించిన స్నేహితులు
పలమనేరు: పట్టణం గుడియాత్తం రోడ్డు ఎస్ఎల్వీ బేకరీ ఎదురుగా స్థానికులు తెలిపిన సమాచారం మేరకు. ఓ యువకుడు ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తూ అదుపుతప్పి బోల్తా కొట్టాడు, దీంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. గమనించిన స్థానికులు రోడ్డు పక్కకు తీసుకువచ్చి అంబులెన్స్ కి సమాచారం ఇచ్చారు. అంతలో గాయపడిన వ్యక్తి స్నేహితులు వచ్చి హుటాహుటిన పలమనేరు ఏరియా ఆసుపత్రికి వైద్యం కొరకు తరలించారు. ఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.