ప్రకాశం జిల్లాలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారితోపాటు 16 నెంబర్ జాతీయ రహదారి మరియు రాష్ట్రీయ రహదారులపై శనివారం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. పేలుడు పదార్థాలు, మత్తు పదార్థాలు గంజాయి వంటి తరలింపు అరికట్టేందుకు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ప్రత్యేకంగా తనిఖీలు చేసి కొత్త వ్యక్తులను ప్రశ్నించి వారి వివరాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు.