బనగానపల్లె: కొలిమిగుండ్ల మండలంలో స్వయంగా జెసిబిని నడిపిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం హనుమంతు గుండం చెరువు వద్ద నిర్వహించిన జలధార - జలహారతి కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. 23 కిలోమీటర్ల కాలువ, ఐదు చెరువుల పూడికతీత పనులను ఆయన సొంత నిధులతో ప్రారంభించారు. స్వయంగా జేసీబీ నడిపి మట్టిని తొలగించారు. వారం రోజుల్లో 17 జేసీబీలతో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని మంత్రి వెల్లడించారు.