నందికోట్కూరు: పాములపాడు పోలీస్స్టేషన్లో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన, ఎస్సై తిరుపాలు
చేసిన తప్పులు పదేపదే చేస్తుంటే తీవ్రమైన చర్యలు ఉంటాయని పాములపాడు ఎస్సై తిరుపాలు హెచ్చరించారు, పాములపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని నేరచరిత్ర కలిగిన వారికి ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు, నేర చరిత్ర కలిగిన వారిని స్టేషన్కు పిలిపించి పలు సూచనలు చేశారు, ఈ సందర్భంగా ఎస్ఐ తిరుపాల్ మాట్లాడుతూ నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తన తో ఉండాలని రౌడీ షీటర్లకు విజ్ఞప్తి చేశారు, ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు