పిట్లం: అమ్మవారి వేడుకలో అపశ్రుతి, మూర్ఛ వ్యాధితో మృతిచెందిన భక్తుడు
అమ్మవారి వేడుకలో అపశ్రుతి, మూర్ఛ వ్యాధితో మృతిచెందిన భక్తుడు... కొచ్చేరు మైసమ్మ తల్లికి మొక్కు తీర్చుకొని వస్తుండగా వ్యక్తి మృతి చేందారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిల్లర్గీ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బేగరి సాయిలు (36) మైసమ్మ తల్లికి కోడిని కోసుకొని ఇంటికి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో మూర్ఛ వ్యాధి వచ్చి కింద పడిపోయి మృత్యువాత పడ్డారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుని బార్య పిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి ఇద్దరు కుమార్తెలున్నారు.