బనగానపల్లె: బనగానపల్లెలో అధికారులు కూల్చివేసిన ఈద్గాను పరిశీలించడానికి బయలుదేరిన కాటసాని,అడ్డుకున్న పోలీసులు
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.గురువారం పట్టణ సమీపంలో అధికారులు కూల్చిన ఈద్గాను పరిశీలించడానికి కాటసాని బయలుదేరారు. దీంతో బనగానపల్లె సీఐలు ప్రవీణ్ కుమార్, మంజునాథ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కాటసాని స్వగృహానికి చేరుకొని ఆయన పర్యటనను అడ్డుకున్నారు.నోటీసులు అందించి హౌస్ అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.