సంగారెడ్డి: కులం పేరుతో డబ్బుతో నాయకుడు కాలేడు, ప్రజల్లో ఉండి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే నాయకులవుతారు : ఎంపీ రఘునందన్ రావు
కులం పేరుతో డబ్బుతో నాయకులు కాలేరని ప్రజల్లో ఉండి ఆత్మవిశ్వాసంతో 10 గంటలు పని చేస్తే నాయకులవుతారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం నర్సాపూర్లో బిజెపి పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మెదక్ ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ వచ్చే సర్పంచ్ ఎంపీటీసీ మున్సిపాలిటీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. వార్డు నుంచి మొదలు సర్పంచ్ వరకు గెలవాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ నాయకులు పాల్గొన్నారు.