నంద్యాల అర్బన్: నంద్యాల నుంచి ఆత్మకూరుకు బస్సులో ప్రయాణించిన కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jun 19, 2026
ఇంధన పొదుపు కేవలం నినాదంగా కాకుండా ఆచరణలో కూడా సాధ్యమేనని నంద్యాల జిల్లా అధికారులు నిరూపించారు. ప్రభుత్వం చేపట్టిన వన్ మంత్- ఫోర్ విజిట్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ రాజకుమారితో పాటు జిల్లా యంత్రాంగం వ్యక్తిగత వాహనాలను పక్కనపెట్టి, సమష్టిగా బస్సులో ప్రయాణించి ఆదర్శవంతమైన సందేశాన్ని అందించింది. శుక్రవారం శ్రీశైలం నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమానికి బస్సులో తరలివెళ్లారు.