జూలూరుపాడు: జూలూరుపాడు మండలంలో పలు గ్రామాల్లో దొంగల బీభత్సం, నగదు, నగలు,వ్యవసాయ సామాగ్రి దోచుకెళ్లిన దొంగలు
జులూరుపాడు మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు.మాచినేనిపేట తండాలో ఎవరూ లేని సమయంలో వెళ్లి ఇంట్లో బీరువా పగులగొట్టి అందులో ఉన్న 5 తులాల బంగారం,40 తులాల వెండి తో పాటు 30వేల రూపాయల నగదు దోచుకెళ్లారుఅక్కడి నుండి పక్క గ్రామమైన పడమటి నర్సాపురం గ్రామంలో ఉన్న ఒక వ్యవసాయ దుకాణంలో కి దూరి వ్యవసాయానికి అవసరమైన వస్తువులు,విత్తనాలు మొలకెత్తిన తరువాత కప్పి ఉంచే సామగ్రి ఇతరత్రా అన్ని దోచుకెళ్లారు.తిరిగి ఈరోజు మధ్యాన్నం ఇంటికి చేరుకున్న బాధితులు లోపలికి వెళ్లి చూసి లబోదిబోమని మొత్తుకోగా చుట్టుపక్కల వారు వచ్చి చూసి పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం తెలుసుకున్న జులూరుపాడు CI,SI పరిశీలించారు