బనగానపల్లె: నందవరంలో వెలిసిన ప్రముఖ క్షేత్రమైన యాగంటి దేవస్థానంలో హుండీ లెక్కింపు.
బనగానపల్లె మండలం నందవరంలో వెలసిన ప్రముఖ క్షేత్రమైన చౌడేశ్వరి దేవస్థానంలో హుండీ లెక్కింపును శనివారం ఆలయ ఈఓ కామేశ్వరమ్మ సమక్షంలో నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. దేవస్థానంలో ఆగస్టు 7 నుంచి ఈనెల 16వ తేదీ వరకు భక్తులు సమర్పించిన కానుకలను కౌంటింగ్ చేయగా వచ్చిన మొత్తం ఆదాయం రూ.18,27,724 లభించిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.