ఆత్మకూరు: రామానాయుడు పల్లి దగ్గర బొగ్గెరు వాగులో పడి బాలుడు మృతి
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, మర్రిపాడు మండలం, రామానాయుడుపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. బొగేరు వాగులో పడి కోనంకి రామ్ చరణ్ అనే 13 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న సిఐ గంగాధర్, ఎస్సై శ్రీనివాసరావు బాలుడు పడి మృతి చెందిన బొగ్గెరు ప్రాంతాన్ని పరిశీలించారు.