తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సులో పొల్గొనడం ఆనందంగా ఉంది: అరకు ఎంపీ గుమ్మాతనూజరాణీ
తిరుపతిలో ఆదివారం నుంచి ప్రారంభమైన జాతీయ మహిళా సాధికారత కమిటీ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న సదస్సుల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అరకు ఎంపీ గుమ్మా తనూజారాణీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాతీయ సదస్సులో దేశంలోని వివిధ రాష్ట్రాల మహిళా ప్రజా ప్రతినిధులు తదితర పెద్దలతో పాటు కలిసి పాల్గొనడం నాకు ఒక మహిళగా చాలా సంతోషాన్నిచ్చిందని, చట్టసభల్లో మహిళా ప్రజాప్రతినిధులకు ఎదురవుతున్న ఇబ్బందులు. సవాళ్లను అధిగమించడంలో మహిళ సాధికారత పాత్ర పై ఈ యొక్క సదస్సులో చర్చించినట్లు ఎంపీ తనూజారాణీ ఆ ప్రకటనలో తెలిపారు.