వేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం..ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివ
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శ్రీరాజరాజేశ్వరి దేవి అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తన కుమారుడు ఆది కార్తీక్ తో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు అనంతరం,శైలపుత్రి అలంకారంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారిని ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు.