ఒంగోలు అర్బన్: ఒంగోలు మినీ స్టేడియంలో విద్యార్థులకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | May 1, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు మినీ స్టేడియంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని శుక్రవారం కలెక్టర్ రాజాబాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఇండోర్ అవుట్డోర్ మరియు అథ్లెటిక్స్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కలెక్టర్ అన్నారు.