పలమనేరు: గంగవరం:గురుపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్,ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు
గంగవరం:మండలంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో జరిగిన పలమనేరు మరియు గంగవరం మండల ఉపాధ్యాయుల గురుపూజోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఉపాధ్యాయులే సమాజ నిర్దేశ్యకులని భావితరాలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీదేనన్నారు. అందుకే తెలుగుదేశం ప్రభుత్వం ఉపాధ్యాయులకు సముచిత స్థానం కల్పిస్తూ వస్తోందని టిడిపి హయాంలోనే అధిక శాతం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక ప్రస్తుత ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.