వర్ధన్నపేట: వర్ధన్నపేటలో కోతుల స్వైరవిహారం: భయంతో వణికిపోతున్న స్థానికులు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట రెండో వార్డులో కోతుల బెడద పెరిగింది. గుంపులుగా సంచరిస్తూ వాహనదారులపై, పాదచారులపై దాడి చేస్తున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.