ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన పిడుగులు, నిర్విరామంగా రెండు గంటల పాటు వర్షం
Ongole Urban, Prakasam | May 22, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గురువారం అర్ధరాత్రి తర్వాత శుక్రవారం తెల్లవారుజామున బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. రెండు గంటలపాటు పిడుగులు ఉరుములు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. రహదారులలో వృక్షాలు నేలకొరిగాయి. దీంతో రాకపోకలకు కొన్ని ప్రాంతాలలో అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పిడుగులు పడడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.