సూర్యాపేట: కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి
మహాత్మా గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ పిలుపునిచ్చారు.మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గురువారం కలెక్టర్ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. గాంధీజీ సత్యం, అహింస, శాంతి వంటి విలువలను పాటిస్తూ దేశానికి స్వాతంత్ర్యం సాధించాడని బాపూజీ నడిచిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని కోరారు.