అనంతపురం అర్బన్: కాలువపల్లి సమీపంలో ద్విచక్ర వాహనం ఘటనలో గాయపడిన వ్యక్తి నగరంలోని ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | Apr 30, 2026
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని తెలుగుప్ప మండలం కాలువపల్లి అనిమిరెడ్డిపల్లి గ్రామాల మధ్యలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లి తాండ గ్రామానికి చెందిన శంకర్ నాయక్ అనే వ్యక్తి నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రిలోని మార్చురికి తరలించారు.