ధర్మవరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని కుర్లపల్లిలో యువకుడిని కిడ్నాప్ చేసి చితకబాదారు.
ధర్మవరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని కనగానపల్లి మండలం కుర్లపల్లి గ్రామానికి చెందిన బాలకొండ శంకర్ అనే వ్యక్తిని అనంతపురం కు చెందిన నలుగురు వ్యక్తులు కార్లో కిడ్నాప్ చేసి అనంతపురం శివారులో చితకబాదారు. స్థానికులు గమనించి శంకరును అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు శుక్రవారం నలుగురు నిందితులను అరెస్టు చేసి దాడికి ఉపయోగించిన కట్టెలు డ్రిప్పు పైపులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి సమీప బంధువైన మహిళను శంకర్ రెండవ వివాహం చేసుకోవడంతో కక్ష కట్టి చితక బాధారని తెలిసింది.