గుంతకల్లు: గుత్తి లోని బండ గేరిలో శ్రీనివాసులు (38) అనే యువకుడు గుండెపోటుతో ఆకస్మిక మృతి
గుత్తి పట్టణంలోని బండగేరి చెందిన శ్రీనివాసులు (38) అనే యువకుడు శనివారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు. ఇంటిలో ఉన్న సమయంలో ఛాతిలో విపరీతంగా నొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే శ్రీనివాసులు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీనివాసులు మృతితో బండ గేరిలో విషాదఛాయలు అలుముకున్నాయి.