ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో క్రేన్ల రాకపోకలపై పోలీసుల ఆంక్షలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ సీఐ నాగరాజ రావు శిల్ప కళాకారుల యాజమాన్యాలు క్రేన్ డ్రైవర్లతో బుధవారం సమావేశ నిర్వహించారు, ఇష్టానుసారంగా రోడ్లపై భారీ రాళ్లతో క్రేన్లు తీసుకురావడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని సీఐ నాగరాజరావు ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇకనుంచి రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటల లోపు మాత్రమే క్రేన్లు నడపాలని ఆదేశించారు, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది శిల్ప కళాకారుల యాజమాన్యాలు క్రేన్ డ్రైవర్లు పాల్గొన్నారు