గాలివీడు మండలం నక్కలవాండ్లపల్లి చెరువు మలుపు వద్ద ఆదివారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో పార్సిల్ కొరియర్ బాయ్ ఆసీఫ్ (33) తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తుల సమాచారం మేరకు, ట్రాక్టర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో ఆసీఫ్ ఎడమ కాలు విరిగినట్లు తెలిసింది. స్థానికులు వెంటనే స్పందించి ప్రైవేట్ వాహనంలో మొదట రాయచోటికి తరలించగా, అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం కడప ఆసుపత్రికి రెఫర్ చేసినట్లు బంధువులు తెలిపారు. పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు.