ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి వీలిక్కి మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ 9 గంటలకు కలశ స్థాపన 10 గంటలకు వివిధ ద్రవ్యాలతో అభిషేకం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు వెయ్యి మంది బాలికలచే దీపోత్సవ కార్యక్రమం మరియు అయ్యప్ప స్వామి నగర ఉత్సవం నెరవేస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు మల్లికార్జునరావు తెలిపారు.