నారాయణ్‌ఖేడ్: యువత శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలి: ఖేడ్‌లో ఏపీజే అబ్దుల్ కలాం జయంతిలో ఫౌండేషన్ చైర్మన్ మహమ్మద్ వాహబ్ పటేల్
భారతదేశాన్ని రక్షణ రంగంలో అగ్ర భాగాన నిలిచేలా కృషిచేసిన ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తితో ప్రతి యువత ముందుకు నడవాలని అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ మహమ్మద్ వాహబ్ పటేల్ అన్నారు. నారాయణఖేడ్‌లో బుధవారం భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వాహబు పటేల్ మాట్లాడుతూ దేశ రక్షణకు అబ్దుల్ కలాం మిస్సైల్ తయారుచేసి రక్షణకు పాటుపడ్డారని గుర్తు చేశారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.