పుంగనూరు: రోడ్డుపై వరినట్లు వేసి నిరసన తెలిపిన బీసీవై పార్టీ నాయకులు.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం నుంచి బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారిలో కత్తర్లపల్లి వద్ద ఏర్పడ్డ గుంతల్లో బీసీవై పార్టీ నాయకులు వారినట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీసీవై పార్టీ నాయకులు బుధవారం మధ్యాహ్నం ఒక గంట ప్రాంతంలో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేరోగులు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు. ఆటోలో బస్సులో కారులో ప్రయాణించే ప్రయాణికులు రోడ్ల పైన ఏర్పడ్డ గుంతల్లో పడి పలువురు గాయపడుతున్నారని. అధికారులు తూతూ మంత్రంగా రోడ్డును మరమ్మత్తు చేస్తున్నారే తప్ప పూర్తి మరమ్మత్తులు చేయాలని కోరారు.