అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఆర్డిటి కార్యాలయం వద్ద ఉన్న శివకోటి శ్రీ పీఠంలో గురువారం ఆరున్నర గంటల సమయంలో అతి రుద్ర సహస్త్ర శాంకాభిషేకం భాగంగా మండప పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుడు అమర్నాథ్ మాట్లాడుతూ నవంబర్ 14 నుంచి 17 వరకు నిర్వహించే అతిరుద్ర సహస్ర శంఖాభిషేకం భాగంగా మండపం పూజ కలసస్థాపన ప్రత్యేక పూజలు నిర్వహించి నేటి నుంచి పూజలు ప్రారంభించడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యుడు అమర్నాథ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పూజారులు పాల్గొన్నారు.