నల్లబెల్లి: నల్లబెల్లి పోలీస్ స్టేషన్ లో ప్రేమ జంటపై దాడి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంటపై అమ్మాయి బంధువులు దాడికి దిగిన సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో బుధవారం జరిగింది.ఆరేపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి, యువకుడు వారం రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం నల్లబెల్లి మండలం శనిగరం గ్రామానికి చెందిన అబ్బాయి బంధువైన సముద్రాల బాలరాజు ఇంట్లో తలదాచుకున్నారు. కాగా, విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు మంగళవారం సాయంత్రం బాలరాజు ఇంటికి చేరుకొని దాడికి దిగారు గ్రామస్తులు అడ్డుకోవడంతో పోలీస్ స్టేషన్కు వెళ్లిన విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు పోలీస్ స్టేషన్లో దాడికి దిగిన ఘటన వైరల్ మారింది