అనంతపురం అర్బన్: నగర శివారులోని రెడ్డిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికుడు చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | Apr 7, 2026
అనంతపురం నగర శివారులోని రెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై ట్రాక్టర్ ను లారీ ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన జంతలూరు గ్రామానికి చెందిన ఎర్రి స్వామి అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మంగళవారం ఉదయం పోలీసులు తెలిపారు. 544 జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.