ఒంగోలు అర్బన్: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశమైన ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్
Ongole Urban, Prakasam | Jun 19, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను శుక్రవారం ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులతో సమీక్షించారు జిల్లా కలెక్టరేట్లోని క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ కలెక్టర్ తో పాటు రెవెన్యూ అధికారులతో సమావేశం అయ్యారు ఒంగోలు నగర పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ఏర్పాటుతో పాటు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ మరియు రెవిన్యూ సమస్యల పరిష్కారం తదితర అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు ఒంగోలు మండలం తో పాటు ఒంగోలు రూరల్ మండలం పరిధిలో కూడా పలు అంశాలను ఆయన ప్రత్యేకంగా చర్చించారు