ఆత్మకూరు: కృష్ణాపురం అటవీ ప్రాంతంలో కలకలం రేపుతున్న కొండచిలువ సంచారం, పరుగులు తీసిన గ్రామస్తులు
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, మర్రిపాడు మండలం, కృష్ణాపురం అటవీ ప్రాంతంలో కొండచిలువ సంచారం కలకలం రేపుతుంది. గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతానికి కొంతమంది గ్రామస్తులు పుట్టగొడుగులు కోసం వెళ్లారు. ఒక్కసారిగా కొండచిలువ కనిపించడంతో గ్రామస్తులు పరుగులు తీశారు. ఓ జింకను మ్రింగుతున్న సమయంలో కాపరులు కేకలు వేయడంతో కొండచిలువ బయటకి వాంతి చేసిందని గ్రామస్తులు చెప్తున్నారు. దింతో కృష్ణాపురం, బెడుసుపల్లి గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని కొండచిలోను దూర ప్రాంతానికి తరలించాలని స్థానికులు కోరారు.