కర్నూలు: కర్నూల్ హ్యాంగోట్ హోటల్ వెనుక గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద మృతి
కర్నూలు రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతిచెందాడు. కర్నూల్ రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు,...దుపాడు–కర్నూలు స్టేషన్ల మధ్య హ్యాంగ్ఔట్ హోటల్ వెనుక భాగంలో ఈ ఘటన జరిగింది. మృతుడు వయస్సు సుమారు 35–40 సంవత్సరాలు, క్రీమ్ రంగు హాఫ్ షర్ట్, మారూన్ షార్ట్ ధరించి ఉన్నాడు. కుడి చేతి మణికట్టు పై “సులోచన” అనే అక్షరాలు గలవు. వివరాలు తెలిసినవారు కర్నూలు రైల్వే పోలీసులను 9908889696 సంప్రదించండి.