ఒంగోలు అర్బన్: గంజాయి కేసుల్లో పాత నిందితులు, వినియోగదారులు, విక్రేతలకు కౌన్సెలింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
Ongole Urban, Prakasam | May 2, 2026
ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లాలో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నిర్మూలన లక్ష్యంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గంజాయి వినియోగిస్తూ పట్టుబడిన పలువురు పాత ముద్దాయిలకు శనివారం టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్ సందర్భంగా గంజాయి మరియు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, చట్టపరమైన పరిణామాలు, కుటుంబం మరియు సామాజిక జీవనంపై ప్రభావాలను టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ సి.ఐ.బీమా నాయక్ వివరించారు. ఈ సందర్భంగా హాజరైన ముద్దాయిల కుటుంబ సభ్యులతో మాట్లాడారు