జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధ చర్యలు : కలెక్టర్ నిశాంత్ కుమార్
అన్నమయ్య జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తామని కలెక్టర్ నిశాంత్ కుమార్ వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూచనల ప్రకారం జిల్లాలో చిరుధాన్యాలు, ఉద్యాన పంటల అభివృద్ధి, చిన్న నీటిపారుదల ట్యాంకుల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు, స్వయం సహాయక సంఘాల బలపరిచే చర్యలు, విద్య–ఆరోగ్య రంగాల మెరుగుదలకు ప్రత్యేక శ్రద్ధ చూపుతామని కలెక్టర్ పేర్కొన్నారు.