ఉరవకొండ: గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని పందికుంట, కోనాపురం, ఎస్ ఎస్ పల్లి గ్రామాల్లో సీజన్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు భాగంగా గ్రామంలో మలాతీయం ద్రావణ పిచికారి, ఇంటింటా జాతీయ కీటక జీవిత కరపత్రాల పంపిణీ కార్యక్రమాలను సోమవారం ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి స్థానిక అధికారులతో కలిసి చేపట్టారు. గ్రామాల్లో ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించి రక్త నమూనాలను సేకరించారు. ప్రజలు సీజనల్ వ్యాధులు దోమలు కుట్టకుండా జాగ్రత్తలు పాటించాలని అవగాహన కల్పించారు.