అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం. పెద్దతిప్ప సముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికను నమ్మించి అత్యాచారం చేసినట్లు నిందితుడు పూల నరేంద్ర పై 2023 వ సంవత్సరంలో మైనర్ బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి పూల నరేందర్ రెడ్డి పై అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుడు పై ఫోక్సో కోర్టు లో నేరం ఋజువు కావడంతో చిత్తూరు ఫోక్సొ జడ్జి , 20 సంవత్సరాల జైలు శిక్ష. పదివేల రూపాయల. జరిమానా విధించినట్లు సిఐ వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు.