దేవరకద్ర: చిన్న చింతకుంట మండలంలోయూరియా కోసం రైతులు ఆందోళన
దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలంలో మంగళవారం రైతులు యూరియా కొరతపై మన గ్రోమోర్ సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. కీలక దశలో ఉన్న పంటలకు సమయానికి ఎరువులు అందకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితులతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నామని, యూరియా లేకపోతే దిగుబడి తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు.