గూడెం కొత్తవీధి మండలం నేలజర్తలో ఉపాధ్యాయుని నిర్మించాలంటూ ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన విద్యార్థులు,తల్లిదండ్రులు
గూడెం కొత్తవీధి మండలం నేలజర్త ఉపాధ్యాయుడిని నియమించాలంటూ దండకారణ్య విమోచన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మార్క్ రాజు ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట విద్యార్థులతో కలిసి విద్యార్థులు తల్లిదండ్రులు బుధవారం మధ్యాహ్నం నుంచి ధర్నా నిర్వహించారు. అధికారులకు నేలజర్త పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని ఎన్నిసార్లు కోరిన పట్టించుకోవడంలేదని మండలంలో సుమారు 46 పాఠశాలలకు ఉపాధ్యాయులు లేరని ఈ నేపథ్యంలో మండల విద్యాశాఖ ఏం చేస్తుంది అంటూ ఆయన ప్రశ్నించారు. నేలజర్త పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించే వరకు తాము ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్ముంచు కూర్చున్నారు.