అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని తొండపాడు గ్రామంలో వెలిసిన బొలికొండ రంగనాథస్వామి ఆలయానికి టెంకాయల విక్రయ హక్కు కోసం జరిగిన వేలం పాట ద్వారా రూ.10.45 లక్షల ఆదాయం లభించింది. ఆలయ ఆవరణలో శుక్రవారం దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ రాణి, ఆలయ కార్యనిర్వాహణాధికారిణి ఎస్.శోభ, గ్రామ పెద్దల సమక్షంలో టెంకాయల విక్రయ హక్కు కోసం బహిరంగ వేలం పాట నిర్వహించారు. వేలం పాటలో ఆరు మంది 50వేలు డిపాజిట్ చెల్లించి పాల్గొన్నారు. ఈ నెల 26 నుంచి ఫిబ్రవరి 3 వరకు బొలికొండ రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా టెంకాయలు విక్రయానికి వైయస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన పుల్లయ్య అనే వ్యక్తి దక్కించుకున్నారు.