తుంగతుర్తి: న్యాయం చేయాలని భర్త ఇంటి వద్ద భార్య తుంగతుర్తిలో ధర్నా
న్యాయం చేయాలని భర్త ఇంటి వద్ద భార్య అనురాధా తుంగతుర్తిలో ధర్నా చేసింది. శనివారం మండల కేంద్రంలో ఘటన చోటు చేసుకుంది. తుంగతుర్తికి చెందిన మట్టపెల్లి మధుతో ఆమెకు 2012లో వివాహమైందని ఆమె చెప్పింది. అనంతరం ఇద్దరు కూతుర్లు పుట్టినప్పటి నుంచి భర్త ఇబ్బందులకు గురి చేస్తున్నాడని పేర్కొంది. కొట్టి ఇంట్లో నుంచి పంపించాడని ఆరోపించారు. ధర్నా చేస్తున్న ఆమెకు మహిళా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.