గుంతకల్లు: కార్యకర్తలకు డిజిటల్ బుక్ అండ, గుంతకల్లులో డిజిటల్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామి రెడ్డి
కూటమి ప్రభుత్వంలో దౌర్జన్యాలు, అక్రమ కేసులు అధికమయ్యాయని కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉండేందుకే మాజీ సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ప్రవేశ పెట్టారని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ను మాజీ ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఎవరైనా ఇబ్బందులు పెడుతుంటే కార్యకర్తలు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వివరాలు నమోదు చేయాలని అన్నారు.