గత ప్రభుత్వానికి ప్రజలు 151 సీట్లు ఇచ్చి అధికారం ఇస్తే జగన్మోహన్ రెడ్డి వారిని మోసం చేశారని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా రంజక పాలన కొనసాగిస్తుందని తెలిపారు. దీనిని ఓర్వలేక వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ విమర్శించడాన్ని దామచర్ల జనార్దన్ ఖండించారు. శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ నాయకులపై ధ్వజమెత్తారు. నవరత్నాల పేరుతో ప్రజలను మోసగించింది మీరు కాదా, కల్తీ మద్యం వికటించి లక్షలాదిమంది ఆరోగ్యాలు పాడయింది నిజం కాదా అని ప్రశ్నించారు.