రాప్తాడు: చిన్మయి నగర్ జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో భక్త కనక దాస జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు.
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయ నగర్ వద్ద ఉన్న జెఎన్టియు విశ్వవిద్యాలయంలో శనివారం 11 గంటల 45 నిమిషాల సమయంలో ఉపకళపతి హెచ్ సుదర్శన్ రావు కనకదాస జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జెఎన్టియు ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు మాట్లాడుతూ భక్త కనక దశ కర్ణాటక రాష్ట్రంలో హవేరి జిల్లా బాధా గ్రామంలో 1509 జన్మించాడని అప్పుడు నుంచి భక్త కనకదాస భక్తి పాటలు పాడుతూ శ్రీకృష్ణ భగవాన్ ని ఉడిపిలో ఒకవైపు తిప్పిన గొప్ప వ్యక్తిని అటువంటి కనకదాస జయంతిని ప్రతి ఒక్కరు నిర్వహించుకోవాలని జేఎన్టీయూ ఉపకులపతి హెచ్. సుదర్శన్ రావు పేర్కొన్నారు.