పటాన్చెరు: జిన్నారం - జంగంపేట రహదారిపై కొనసాగుతున్న వరద నీరు
జిన్నారం జంగంపేట రహదారిపై మంగళవారం వరద నీటి ప్రవాహం పెరిగింది. గత రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా మున్సిపల్ కేంద్రంలోని రాయిని చెరువు అలుగు పారింది. దీంతో చెరువునుంచి వచ్చిన వరద నీరు రహదారిపైకి ప్రవహించింది. ఫలితంగా జిన్నారం–జంగంపేట రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు నీటి మట్టం పెరగడంతో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణించాల్సి వచ్చింది.