లాలు ప్రసాద్ యాదవ్, తేజేస్వీ యాదవ్ ల పరిస్థితే వై,ఎస్ జగన్ కు పడుతుంది: శ్రీశైలంలో మాజీ MLA బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
శ్రీశైల శ్రీ భ్రమరాంబ,మల్లికార్జున స్వామి ఎంత పవర్ ఫుల్లో బీహార్ ఎన్నికలే నిదర్శనం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీశైలం దర్శనం అనంతరం బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని, ఎన్ డి ఏ స్వీఫ్ చేసి గతం కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు గెలుసుకుందని, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ది ఐరన్ లెగ్ అని, ప్రధాని మోడీ ది గోల్డెన్ లెగ్ అని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు,గురువారం శ్రీశైల శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లను టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి దర్శనం చేసుకున్నారు, బీహార్లో గతే వైయస్ జగన్ కు పడుతుందని బైరెడ్డి అన్నారు,