ఆళ్లగడ్డ: రేషన్ వినియోగదారులకు శుభవార్త చెప్పిన ఆళ్లగడ్డ మండలం తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి
ఆళ్లగడ్డ మండలంలోని రేషన్ వినియోగదారులకు ఈనెల రేషన్తో పాటు కందిపప్పును కూడా ఇస్తామని మండల తహశీల్దార్ జ్యోతి రత్నకుమారి బుధవారం తెలిపారు. ఎండీయూ వాహనాల ద్వారా ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి రేషన్ పంపిణీ చేస్తామన్నారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.